కార శబ్దంతో ఏడుపు మానేసి చేతులు జోడించి అబ్బురపరచిన చిన్నారి మహాలక్ష్మి...

కార శబ్దంతో ఏడుపు మానేసి చేతులు జోడించి అబ్బురపరచిన చిన్నారి మహాలక్ష్మి...

అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05

భారతదేశంలో ఋషులు మేధావులు అనేక విషయాలను మనకు బోధించారు వాటిని మనం నమ్మక నిర్లక్ష్యం చేయడంతో అవి మనకు కనిపించకుండా పోతున్నాయి అలాంటి మన హైందవ రహస్యాల్లో ఒకటైన అద్భుత ఘట్టం 8 రోజుల చిన్నారి ద్వారా ఆవిష్కృతమైనది.చిన్నారులు ఏడుస్తున్నప్పుడు ఓంకార శబ్దం ద్వారా ఏడుపు మానేస్తారని ఋషులు మేధావులు చెప్పిన మాటలని ఓ చిన్నారి మహాలక్ష్మి నిజం చేసింది. వివరాల్లోకి వెళితే  కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు లో ఉండే ఉరుమడ్ల శ్రీనివాస్ ఆయన పెద్ద కూతురు హేమలత కు ఐలాపూర్ గ్రామానికి చెందిన బండి తరుణ్ కుమార్ తో వివాహం జరిగింది. హేమలత తరుణ్ దంపతుల కూతురు మహాలక్ష్మి జన్మించి ఎనిమిది రోజులే అవుతుంది చిన్నారి ఆకలితో ఏడుస్తున్నప్పుడు హేమలత తండ్రి ఉరుమడ్ల శ్రీనివాస్ యోగా ద్వారా తెలుసుకున్న విషయం ఓంకారం జపించడంతో ఏడుపు మానేసి చేతులు జోడించి ప్రశాంతంగా ఉండడం ఆ తల్లిదండ్రులను బంధువులను ఆశ్చర్యానికి గురిచేసింది. మన ఋషులు మేధావులు చెప్పిన ప్రతి విషయం అనేక చోట్ల నిజమవుతూనే ఉంది సనాతన హైందవ ధర్మంలో మన పూర్వీకులు పెద్దలు తెలిపిన అన్ని విషయాలు అద్భుతాలే ఒక్కొక్కటి కళ్ళారా చూస్తే నమ్మాలో వద్దు అని సందేహం కలగక మానదు.

Views: 1

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని