ఆస్తి కోసం త‌ల్లిలా ఆద‌రించారు.. కానీ మృత‌దేహాన్ని తాకేందుకు నిరాక‌రించారు..

ఆస్తి కోసం త‌ల్లిలా ఆద‌రించారు.. కానీ మృత‌దేహాన్ని తాకేందుకు నిరాక‌రించారు..

 జగిత్యాల : ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ క‌న్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాక‌రించారు. రోడ్డుపైనే మృత‌దేహాన్ని వ‌దిలేసి మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తించారు. ఈ అమానుష ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది.

జ‌గిత్యాల జిల్లా కేంద్రంలోని తీన్‌ఖనికి చెందిన సాదుల సత్తమ్మ (85), లక్ష్మణ్‌ దంపతులు. వీరికి పిల్లలు లేరు. సత్తమ్మ భర్త లక్ష్మణ్‌ ఇరవై ఏండ్ల క్రితం మృతి చెందాడు. అయితే సంతానం లేకపోవడంతో తన భర్త లక్ష్మణ్‌ తమ్ముడి కొడుకులైన ప్రసాద్‌, రవి ఇద్దరికి ఆస్తులు పంచి వారి వద్దే ఉంటున్నది. సత్తమ్మను వారిద్దరూ వంతుల వారీగా పోషిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యంతో దవాఖానలో చేరిన ఆమె, మంగళవారం రాత్రి మృతిచెందింది.

అంబులెన్స్‌లో మృతదేహాన్ని కాలనీకి తీసుకురాగా, ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ఇద్దరు కొడుకులు నిరాకరించారు. ఆరు గంటల పాటు అంబులెన్స్‌లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సత్తమ్మ పాత ఇంటి తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఆఖరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకురాకపోవడంతో, బుధవారం ఉదయం ప్రైవేట్‌ వ్యక్తులతో ఆఖరి మజిలీ నిర్వహించారు.

Views: 1

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని