మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి

మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి

రామవరానికి ఇండ్ల పట్టాలు అందజేయాలని వినతి పత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 03.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ప్రాంత వాసుల వివిధ సమస్యలలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్మాణము చేసి అందజేయుట, గత ప్రభుత్వం మంజూరు చేసిన 75 గజాల స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి 14,377 మంది దరఖాస్తు చేసుకోగా రామవరం పరిధిలో ఉన్న ఏడు వార్డులు (6,7,8,9,10,11,12) దాదాపు 3,200 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. రామవరం ప్రాంత వాసులకు కేవలం కరెంటు బిల్లు, మున్సిపాలిటీ పన్ను చెల్లించే రశీదులు తప్ప ఎలాంటి హక్కు పత్రాలు లేవు. గతంలో రామవరంలో దాదాపు 1800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. కానీ ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో డీ ఫాం పట్టా,సాదా సేల్, రిజిస్టర్డ్ సేల్ డీడ్, జీవో నెం.58, పొజిషన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ వంటివి అడుగుతున్నారు. కావున రామవరం ప్రాంత వాసుల సమస్యలను గుర్తించి నిబంధనలు సవరించాలని కోరుతున్నాము. గత ప్రభుత్వంలో 75 గజాల స్థలం పొందిన కొత్తగూడెం వాసులకు ఆ స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రామవరం వాసులకు కనీసం పొజిషన్ సర్టిఫికెట్ అయినా ఇచ్చేలా చొరవ చూపాలని కోరుతున్నాము. కొత్తగూడెం పట్టణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను లక్కిడ్రా ద్వారా 807 మందికి ఎమ్మెల్యేలు, అధికారుల సమక్షంలో కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి నెంబర్ వచ్చిన వారికి త్వరతగతిన అందించాలని కొత్తగూడెం పట్టణ వాసుల తరపున కోరుతూ మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని