ఎస్ ఎఫ్ ఐ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ఎస్ఎఫ్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన యు టి ఎఫ్ మండల నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.
పాల్వంచ మండలంలోని బొల్లేరుగూడెం ప్రభుత్వ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ పాల్వంచ మండలం నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ పాల్వంచ మండలం నాయకులు టి. వెంకన్న ఎం శ్రీనివాసరావు, ఏ.నరసింహారావు సి హెచ్ పాల్గొన్న ముఖ్యమైన అతిథులుగా హాజరై ఎస్ఎఫ్ఐ పాల్వంచ మండల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు అయిన యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ నిరంతర విద్యార్థుల హక్కుల పోరాటాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు.1970 లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ 55 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలు కోసం పని చేస్తుందన్నారు. విద్యార్థుల హక్కుల పోరాటాలతో పాటు అనేక సాంసృతిక కార్యక్రమాలు, నిరంతరం విద్యార్థుల చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ సంఘం నిర్వహించింది అన్నారు. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ నూతన సంవత్సర పాల్వంచ మండల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్, ఎస్ఎఫ్ఐ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవాభివందనలతో
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు
రామ్ చరణ్
9573375531