26న కొత్తగూడెంలో సిపిఐ వసంతోత్సవ ర్యాలీ సిపిఐ జిల్లా నాయకులు జమలయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 23.
కొత్తగూడెం భారత కమ్యూనిస్టు పార్టీ వందో ఏట అడుగుపెడుతున్న సందర్బంగా ఈ నెల 26న సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వసంతోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా సమితి సభ్యులు, కొత్తగూడెం పట్టణ సహాయ కార్యదర్శి కంచర్ల జమలయ్య తెలిపారు. స్థానికి సిపిఐ కార్యాలయం 'శేషగిరిభవన్'లో సోమవారం జరిగిన కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశంలో జమలయ్య మాట్లాడుతూ భారత దేశంలో వందేళ్ల చరిత్రగల ఏకైక పార్టీ సిపిఐ అని, స్వతంత్ర పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, స్వతంత్ర అనంతర దేశ నిర్మాణంలోనూ కీలక భూమిక పోషించిందని తెలిపారు. వసంతోత్సవాల సందర్బంగా అన్నివార్డుల్లో జెండావిష్కరణలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ర్యాలీకి పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భూక్యా శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, జహీర్, ప్రభాకర్, ఎర్రబెల్లి శంకర్, నేరెళ్ల శ్రీనివాస్, దాట్ల శ్రవణ్, ఇర్ఫాన్, నేరెళ్ల రమేష్, అజయ్, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.