పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 24.
కొత్తగూడెం విద్యానగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, తుళ్లూరి బ్రహ్మయ్య, కోనేరు చిన్ని, ఐఎన్టియుసి వైఎస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న మాట్లాడుతు సర్వమత సారాంశం ఒక్కటేనని మనుషులను ప్రేమించి, ఆదరించి ఆదుకోవడమేనన్నారు. సర్వమత సారాంశం ఒక్కటే అనే విధంగా క్రిస్టియన్ పాస్టర్ లతో పాటు, పలువురు పూజారులు, మౌలానాలతొ ప్రార్థన ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏసును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ఏసు బోధనలతో శాంతియుత జీవనం గడపాలని పాస్టర్లు సూచించారు. క్రైస్తవులకు బైబిలే భక్తి మార్గం చూపిస్తుందని, ప్రభువు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ప్రజలందరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సొసైటీ చైర్మన్ భాగం హనుమంత్ రావు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కౌన్సిలర్లు తలుగు అనిల్, సత్యభామ, పరమేష్ యాదవ్, బాలిశెట్టి సుందర్ రాజ్, మసూద్, బాల పాసి, పూనెం శ్రీనివాస్, వజ్జా చందు, మైనారిటీ గౌస్, జానీభాయ్, జయప్రకాష్, వెంకట్ యాదవ్, పెనగడప నాగారాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు సత్యనారయణరెడ్డి, మతిన్, రాము, కుంచం వెంకట్, జయసూర్య, శ్రీకాంత్, శివ, సందీప్, కున్సోత్ కిషన్, బోదాసు కనకరాజు, అజ్మిరా మంగ్య, మహిళా నాయకురాళ్లు వాణిరెడ్డి, హైమావతి, రమాదేవి, రుక్మిణి, శాంతి, స్వాతి రెడ్డి, స్వప్నరెడ్డి, హేమారెడ్డి క్రిస్టియన్, మైనార్టీ, హిందు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.