సీఎం కప్ లో భాగంగా స్టేట్ పవర్ లిఫ్టింగ్ లో 2 బంగారు పతకాలు 1 కాంస్య పతకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 03.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు
సీఎం కప్ లో భాగంగా, ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, రెండు బంగారు పతకాలు ఒక కాంస్య పతకం, సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి తెలిపారు. గెలుపొందిన క్రీడాకారుల్లో 66 కేజీల పురుషుల విభాగంలో మోడెం వంశీకి బంగారు పతకం, 57 కేజీల మహిళల విభాగంలో బట్టు శ్వేత కి బంగారు పతకం, 62 కేజీల విభాగంలో ఎస్కే రేష్మా కి కాంస్య పతకం వచ్చినట్లు తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్, పరంధామ రెడ్డి రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు, వి మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కోశాధికారి మహంతి వెంకటకృష్ణాజి ( సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టర్ ) మరియు పట్టణ ప్రముఖులు, పలు క్రీడా సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, పట్టణ ప్రముఖ సంఘ సేవకుడు, గాదె మాధవరెడ్డి, మరియు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సభ్యులు తదితరులు అభినందించడం జరిగింది.