పంటలను పరిశీలించిన వ్యవసాయధికారి
On
అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 2:
హుజూరాబాద్ మండలం, పోతిరెడ్డి పేట గ్రామంలో గురువారం రోజున జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి సాగు చేసే పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేస్తూ వరిలో సమగ్ర ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులైన 20:20:0:13 వంటి ఎరువులను వాడకూడదని దీనిలో గల గంధకం వలన పంటలపై సల్ఫైడ్ ప్రభావంతో పంట దెబ్బతింటుందని, రైతులు 30 రోజులలోపు పొటాష్ ని తప్పకుండా వెయ్యాలని సూచించారు. ఒకే వరి పంట పండించ పొలాల్లో రైతులు జింక్ సల్ఫేట్ ని ఎకరాకి 20 కిలోలు తప్పక వేయాలన్నారు. అలాగే రైతులు నాటు వేసే ముందు నారు యొక్క ఆకు కొనలను కత్తిరించి నాటలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల వ్యవసాయ అధికారి చాడ భూంరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
Tags:
Related Posts
Latest News
చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
05 Jan 2025 21:08:43
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...