ఎల్ఎండి కెనాల్ నీటిని యాసంగి సాగుకు వెంటనే విడుదల చేయాలి

ఎల్ఎండి కెనాల్ నీటిని యాసంగి సాగుకు వెంటనే విడుదల చేయాలి

 

అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 23:
హుజూరాబాద్ సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సోమవారం రోజున నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  గిట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్ ప్రారంభమై నారు మడులు ఎదిగినప్పటికీ రైతాంగం నాట్లు వేసుకోవాలంటే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, కెనాల్ నీటిని విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేద వారికి వెంటనే కేటాయించాలని, ఇది చేయకుండా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఉత్సవాలు జరుపుకుంటుంది తప్ప ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, పూర్తిస్థాయిలో అమలు చేయడంపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల సర్వే తో కాలం వెళ్లదీసే కార్యక్రమం చేపడుతుందని, దీనిలో సర్వే ఎంటర్ చేయడంలో  అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై ఇప్పటికే  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు వస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడకుండా, ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, నిరంతరం( బి ఆర్ ఎస్) పార్టీ, కేటీఆర్, కెసిఆర్  సమస్యలు ఉన్నట్టు, వారి కోసమే పని చేస్తున్నడూ అనే భావన ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కావున ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ ఎమ్మెల్యే గెలవలేదులే అనే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం దృష్టి సారించడం లేదని, ఆరోపించారు. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రానున్న రోజులలో మండల ప్రజా సమస్యలనే పోరాటాలు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం హుజూరాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్, కదిరే రమేష్, కొంకట చంద్రయ్య, రాచపల్లి  సారయ్య, దొడ్డ రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని