భద్రాద్రి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్ 

IMG-20250101-WA0092

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 01.

కొత్తగూడెం ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్ గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు వెన్నుదన్నుగా ఓట్లు వేసి గెలిపించిన యువతకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితలకు, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేందుకు ప్రయత్నిస్తామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చీకటి కార్తీక్ తెలిపారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని