పెనగడపలో పర్యటించిన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 24.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పెనగడప గ్రామమును సింగరేణి ప్రభావిత గ్రామంలో గుర్తించి రెమిడీయేషన్ ప్లాన్ అండ్ నేచురల్ కమ్యూనిటీ రిసోర్స్ అగ్మెంటేషన్ ప్లాన్ ఎం సి ఆర్ ఎ పి ) సి ఎస్ ఆర్ ఫండ్స్ తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మంగళవారం) ఎన్.బలరాం, ఐఆర్ఎస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పెనగడప గ్రామం నందు పర్యటించి సింగరేణి సంస్థ ద్వారా జరిగిన జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను (ప్రభుత్వ పాఠశాల సివిల్ మరమ్మత్తు పనులు ఫర్నిచర్, సిసి రోడ్లు రోడ్డు సైడ్ కాలువలు, రహదారుల వెంబడి సోలార్ లైట్లు, ఆర్.ఓ వాటర్ ప్లాంట్స్, చెత్త తీసుకొనుటకు వాహనాలను వివిధ హరితహారం ద్వారా మొక్కలు నాటిన పనులు) సంబంధిత అధికారులతో వెళ్లి సమీక్షించడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల గురించి వెనగడప గ్రామ పంచాయతీరాజ్, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలను అభివృద్ధి పరచడంలో ఎప్పుడు ముందుంటుందని అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ముఖ్య బాధ్యతగా భావించి వివిధ రకాల మొక్కలను, ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. తదుపరి పెనగడపలోని పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఇతర ప్రజా ప్రతినిధులు సింగరేణి అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు అందుకు వారు సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలకు సంతృప్తి చెందుతున్నామని తెలియజేశారు.తదుపరి పెనగడప గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు మొక్కలు నాటుతూ స్థానికులను సింగరేణి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తమ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, కనీసం ఇంటికి మూడు చెట్లు పెంచి వాటిని పరిరక్షించాలని,పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం గ్రామస్తులు వారికి అవసరమైన వసతులు అయిన కమ్యూనిటీ హాల్, చెరువల పూడికలు తీయించడం,వెదురు ప్లాంటేషన్, లైబ్రరీ ఏర్పాటు, చెక్ డ్యామ్ నిర్మించడం, వైకుంఠధామం లో బోర్ వెల్స్ నిర్మించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి వసతులను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కి తెలియజేయడం జరిగింది అందుకు వారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ఎన్.బలరాం, ఐఆర్ఎస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) డైరెక్టర్ (పా) జి. వెంకటేశ్వర్ రెడ్డి, జిఎం (సిడిఎన్) ఎస్.కే. సుభాని, కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు, జిఎం (ఎఫ్&ఎ) ఎం. సుబ్బారావు, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ కే.రాములు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,ఎస్ఓ టు జిఎం జీవీ కోటిరెడ్డి, ఎజిఎం (సివిల్) సిహెచ్. రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ జీకే ఓసి ఎం.శ్రీ రమేష్, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ తోట. సత్యనారాయణ, మేనేజర్ జికేఓసి ఎం.రామచంద్ర మురళి, జీకేఓసి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ వి.మధుకర్, ఐటీ మేనేజర్ కే.శేషశ్రీ, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి.తౌరియా పెనగడప గ్రామ పంచాయతీ రాజ్ కార్యదర్శి ధరావత్ హనుమంతు, స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, అంబేద్కర్ నగర్ మాజీ సర్పంచ్ జగదాంబ, ఉప సర్పంచ్ సంతోష్, కొత్తగూడెం ఏరియాలోని అధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.