దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి

దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి

 

అంబేద్కర్'పై అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే 

వామపక్షాల జిల్లా నేతలు.బస్టాండు సెంటర్లో నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 30.
కొత్తగూడెం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కరును అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హొమ్ శాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వామపక్షాల జిల్లా నేతలు డిమాండ్ చేశారు. వామపక్షాల జాతీయ కమిటి పిలుపుమేరకు దేశ వ్యాపితంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండు సెంటరులో సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) న్యూ డిమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, సిపిఐ (ఎంఎల్) న్యూ డిమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, సిపిఐ (ఎంఎల్) న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులు  సహాయకార్యదర్శి గౌని నాగేశ్వరరావు, చంద్రన్నవర్గం నాయకులు కందగడ్ల సురేందర్, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ముద్దా బిక్షం,  మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాజ్యాంగంపట్ల గౌరవం లేదని, రాజ్యాంగాన్ని మార్చాలనే బిజెపి ఆంతర్యం అమితాషా వ్యాఖ్యలతో బహిర్గతమైందన్నారు. అంబేద్కర్, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అమితాషా వ్యాఖ్యలపై స్పందించాల్సిన ప్రధాని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్ పార్టీల నాయకులు కంచర్ల జమలయ్య,  ఏజే రమేష్, భూక్యా శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, ఎస్ కె ఫహీమ్, యూసుఫ్, రేపాకులా శ్రీనివాస్, ధర్మరాజు, మంద నర్సింహారావు, భూక్యా రమేష్, హరికృష్ణ, ఖయూమ్, ఉమర్, మోకాళ్ళ రమేష్, వీరభద్రం, వీరన్న, కుంజా కృష్ణ, రెడ్డి,  లక్ష్మి, ఉప్పరబోయిన రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, కృష్ణ, ఉమ, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: