కూనంనేని సమక్షంలో 20 కుటుంబాలు సిపిఐలో చేరిక
ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 28.
కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీకి చెందిన 20 కుటుంబాలవారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో చేరారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో వీరికి పార్టీ ఎర్ర కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐని జనం ఆదరిస్తున్నారని, ఇది ప్రజలకు పార్టీ అందిస్తున్న సేవల ఫలితమేనని అన్నారు. నూతనంగా చేరుతున్న నాయకులు ప్రజాసంఘాల్లో భద్రతలు తీసుకొని సేవలందించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. రేగళ్ల, పరిసర గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ రహదారులు, విద్యుత్, అంతర్గత రోడ్లు, త్రాగు, సాగు నీరు అందించేందుకు నిత్యం కృషి జరుగుతోందన్నారు. మారినేని మాధవరావు, షేక్ పాషా, దళవాయి వినయ్, శెట్టుపల్లి శివాజీ, షేక్ అన్వర్ పాషా, వాసం శివకృష్ణ, పడిగ అభిలాష్, వట్టం హరి, గంగుల రమేష్, దడవాయి వెంకటేశ్వర్లు తదితరులు సిపిఐలో చేరినవారిలో వున్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, నాయకులు కంటెం శ్రీనివాసరావు, వెంకటనర్సయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.