మాట్లాడుతున్న కంచర్ల జమలయ్య
గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష
డిమాండ్లు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదు
నిరసన ధీక్షలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జమలయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 28.
కొత్తగూడెం గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో గతప్రభుత్వంకు తీరునే ప్రదర్శిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేరీతిలో వివక్షత ప్రదర్శిస్తోందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారంకోరుతూ కార్మిక సంఘాల జేఏసి పిలుపుమేరకు బస్టాండు సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ శిభిరాన్ని ప్రారంభించిన అనంతరం జమలయ్య మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించినప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించి ఆ ఉద్యమాల పట్ల నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్న కార్మికులకు చట్టబద్దమైన వేతనాలు అమలు చేయకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని, కార్మికులకు పనిభద్రత కరువవుతోందన్నారు. కనీస వేతనం 26 చెల్లించాలని, ప్రభుత్వం జారీ జీవో ప్రకారం స్వీపర్లకు రూ.15వేలు, ఇతర విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రూ.19,500లు చెల్లించాల్సి ఉండగా ఈ జీవో ఎక్కాడా అమలుకు నోచుకోవడం లేదని, ప్రమదం జరిగి మృతిచెందిన, గాయాలపాలవుతున్న కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదన్నారు. మల్టిపర్పస్ విధానంతో కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రమాద భీమా, గ్యాట్యూటీ, సెలవుల అమలు, గుర్తింపు కార్డులు, కార్మిక చట్టాల అమలు వంటి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాచర్ల శ్రీనివాస్, ఎండి యూసఫ్, దుంపల అమర్నాథ్, కిషోర్ కుమార్, సలీం రామకృష్ణ, మంజుల, షరీఫ్, ప్రవీణ్, వంశీ, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.