రామవరం ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 31.కేంద్రంలోని రామవరం ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ 100 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో ఎనిమిది మంది డాక్టర్లు ఉండాలి కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉండడం ఘమనార్ధమని ఒక ఆర్ఎంవో స్థాయి డాక్టర్ కూడా లేకపోవడం వల్ల మహిళలకు వైద్యం సరిగా అందడం లేదని రేడియాలజీ టెక్నీషియన్లు లేరని, ఎక్సరే టెక్నీషియన్లు లేరని తద్వారా మహిళల డెలివరీ శాతం 50 శాతానికి పడిపోయిందన్నారు. త్వరలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మంత్రి దామోదర రాజా నర్సింహ ను కలిసి ఆసుపత్రి స్థితిగతులను వివరించి సరైన సిబ్బందిని రిక్రూట్ అయ్యేలా చూసి ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఎమ్మెల్యే సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, వెంట 8వ వార్డు కౌన్సిలర్ కంచర్ల జములయ్య, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్, సిపిఐ నాయకులు మునిగడప వెంకన్న,భూక్య శ్రీనివాస్, ఎస్.కె ఫయూమ్,పేయ్యాల రంగారావు, బరిగెల భూపేష్ కుమార్, లగడపాటి రమేష్, తూముల శ్రీనివాస్, వాకపల్లి హరినాథ్, ఎస్.కె ఖయ్యూం, కూరగాయల శ్రీనివాస్, కొత్తూరి రవి, కన్నా, సురేష్, నరేష్ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు