ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.
కొత్తగూడెం నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం 9 గంటలకు సుజాతనగర్ మండల్ సుజాతనగర్ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం, పాల్వంచ మండలం ప్రభాత్ నగర్, యానం బైలు నుండి జిన్నగట్ట వరకు హెచ్ ఎల్ బి పనుల శంకుస్థాపన ఉదయం 10:00 గంటలకు, పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో ఎస్టీ ఆవాసాల అనుసంధాన బిటి రోడ్లు శంకుస్థాపన ఉదయం 10.40 గంటలకు, లక్ష్మీదేవి పల్లి మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర సైన్స్ ఆర్ట్స్ కళాశాలలో రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం 11:00 గంటలకు,లక్ష్మీదేవి పల్లి మండలం చాటకొండ గ్రామం ఆరవ బెటాలియన్ ప్రవేశ ద్వారం నుండి పెరేడ్ గ్రౌండ్స్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం 12. 00 గంటలకు, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ టెంపుల్ దగ్గర కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం మధ్యాహ్నం 1:00 గంటలకు మరియు రైల్వే స్టేషన్ నుంచి ఎదురుగడ్డ వరకు రోడ్ విస్తరణ ప్రారంభోత్సవం. ఇందిరా మహిళా శక్తి కింద స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న ఫుట్ కోర్టు సందర్శన 1.50 గంటలకు లో పాల్గొనన్నాను ఇట్టి కార్యమానికి ప్రింట్ మరియు ఎల్ట్రానిక్ ఆహ్వానిస్తున్నాం.