భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పెంపొందించిన మహోన్నత నేత మన్మోహన్ సింగ్
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్,
డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 27.
భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పెంపొందించి, ప్రపంచ దేశాల్లో భారత దేశ స్థాయిని మెరుగుపరిచిన మహోన్నత నేత మన్మోహన్ సింగ్ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
దేశ 14 వ ప్రధాన మంత్రిగాపరిపాలన సాగించి, దేశంలో ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించి, ఎన్నో పురస్కారాలు అందుకున్న మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు.
పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.
మన్మోహన్ చిత్రపటానికి కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపి, రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రధానిగా, 1990 వ దశకంలో ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ ఇన్ని ఆర్ధిక సంస్కరణలు చేశారన్నారు. 100 రోజులు ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలతో పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. ప్రధాని పదవి కంటే ముందు దేశ ఆర్ధిక మంత్రిగా, ప్రణాళికా సంఘం చైర్మన్ గా, ఆర్బిఐ గవర్నర్ గా విశిష్ట సేవలు అందించారన్నారు ఆయన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లతో పాటు పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారన్నారు. మన్మోహన్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదవారికి సహాయపడాలని కొత్వాల అన్నారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, ఎల్ డి ఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, వై వెంకటేశ్వర్లు, కాల్వ భాస్కర్ రావు, అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి, కాపర్తి వెంకటాచారి, చింతా నాగరాజు, సందు ప్రభాకర్, కందుకూరి రాము, ఎస్.కె చాంద్ పాషా, మాలోత్ కోటి నాయక్, కాపా శ్రీను, హెచ్ మధు, గంధం నర్సింహారావు, జాలే కరుణాకర్ రెడ్డి, పులి సత్యనారాయణ, ఉండేటి శాంతివర్ధన్, ధర్మసోత్ ఉపేంద్ర నాయక్, భాషాబోయిన అశోక్, ఎస్.కె బాషా, మస్నా శ్రీనివాస్, బండి నాగరాజు, గుగులోత్ బాలు, భూక్యా రాములు, జర్పుల లింగ్యా నాయక్, కటుకూరి శేఖర్, ఎస్.కె అజారుద్దీన్, దేవా, గంగపురి శేఖర్, జక్కుల రాము, నగేష్, మరి వెంకన్న, అజిత్, భగ్య,బి మధు తదితరులు పాల్గొన్నారు.