ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి

ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి

 

పి వి రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 23.
పాల్వంచ భారత దేశ ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పి.వి. నరసింహారావు అనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత మాజీ ప్రధాని, బహుబాషా కోవిదులు తెలంగాణా ముద్దు బిడ్డ భారతరత్న, దివంగత పి.వి. నరసింహారావు 20 వ వర్ధంతి సందర్బంగా పాల్వంచ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం పాల్వంచ అయ్యప్పనగర్ లోని రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పి.వి.చిత్ర పటానికి కొత్వాల తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ పి.వి. నరసింహరావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, దేశాన్ని ప్రగతి పధంలో నడిపించారన్నారు. పి.వి. ఆశయాలకనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కొత్వాల అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, ఎల్ డి ఎం కో ఆర్డినేటర్ బద్ది కిషోర్, పట్టణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, నాయకులు చింతా నాగరాజు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి, హెచ్. మధు, కాపా శ్రీను, ఉండేటి శాంతివర్ధన్, బాషబోయిన అశోక్, మాలోత్ కోటి నాయక్, గంధం నరసింహారావు, కటుకూరి శేఖర్, బలగం కొండల రావు, వెంకట రత్నం, అజిత్, వేణు, దానియేలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని