అయ్యప్ప స్వామికి ఘనంగా పుష్పయాగం..
-భక్తులచే పుష్పాభిషేకం.. అన్న ప్రసాద వితరణ..
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 01:
పట్టణంలోని అయ్యప్ప జ్ఞాన సరస్వతీ దేవాలయంలో బుధవారం పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజును పురస్కరించుకుని ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రాముశర్మ గారి వైదిక నిర్వహణలో స్వామి వారి మూలవిరాట్టుకు పంచామృతాలు నిర్వహించిన అనంతరం పుష్పయాగం నిర్వహించారు. లక్ష పుష్పార్చన శాశ్వత దాతలు చింత లక్ష్మీనారాయణ -లావణ్య, డా. బుడిగె గంగా సుమన్ - అర్చన దంపతులు వ్యవహారించారు.
ఈ సందర్భంగా రాము శర్మ మాట్లాడుతూ మండల దీక్ష కాలంలో అయ్యప్ప స్వామికి పుష్పయాగం చేయడం వల్ల పట్టణ ప్రజలకు శుభాలు చేకూరుతాయని అన్నారు.విచ్చేసిన భక్తులకు లక్ష పుష్పార్చన శాశ్వత అన్నదాతలు ముక్కెర చంద్రశేఖర్ - లత, దండికె వెంకటేష్ -భావన దంపతులు అన్న ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు చిద్రాల నారాయణ గురుస్వామి, అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తోట రాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, ఉపాధ్యక్షులు గట్ల ఆనంద్, నిమిషకవి నాగరాజు, తులసి కృష్ణ, సహాయ కార్యదర్శి కాసు క్రాంతి, గెల్లె శ్రీనివాస్, చలిగంటి వినోద్ కుమార్, గౌరవ సలహా సభ్యులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్ అల్వాల శ్రీనివాస్, బొమ్మ రాజేశం, వాన్కార్ రాజు, కల్లూరి సాయి,అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు.