బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు
బాల కార్మికులు కనిపిస్తే 1098,డయల్ 100కు సమాచారం అందించండి
జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.
కొత్తగూడెం జనవరి 1 నుండి 31వ తారీఖు వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్-ఎక్స్ ఐ లో భాగంగా పోలీస్ అధికారులు,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సమావేశమయ్యారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లయిన కొత్తగూడెం,పాల్వంచ,భద్రాచలం,ఇల్లందు,మణుగూరు లో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి,జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.ఆపరేషన్ -స్మైల్ ఎక్స్ ఐ కి సంబందించిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు,వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆపరేషన్ స్మైల్-ఎక్స్ ఐ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ ఎక్స్ ఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,18సంవత్సరాల లోపు తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులలో,హోటళ్లలో, ఫ్యాక్టరీ లలో పనిచేస్తున్న బాల కార్మికులను మరియు వదిలివేయబడిన పిల్లలను,రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు.చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి హెచ్చరించారు.బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని,ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి భద్రాచలం విక్రాంత్ కుమార్ సింగ్ ఐ పి ఎస్ ఆపరేషన్ స్మైల్ పోలీస్ నోడల్ ఆఫీసర్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్, డి ఎస్ పి .డి సి ఆర్ బి మల్లయ్య స్వామి గౌడ్ , డి ఎం హెచ్ ఓ భాస్కర్ నాయక్, డి డబ్ల్యూ ఓ స్వర్ణలత లెనినా, సిడబ్ల్యూసి సభ్యులు అంబేద్కర్,సాదిక్ పాషా,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ షర్ఫుద్దీన్,నాగరాజు,యేసుపాదం, శాస్త్రి, డీసీపీవో హరి కుమారి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్, ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్సైలు రమాదేవి,రాకేష్,తిరుపతి,నాగబిక్షం,రామకృష్ణ,సూర్యం,డివిజన్ వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది,ఆపరేషన్ స్మైల్-ఎక్స్ ఐ టీములు పాల్గొన్నారు.