విద్యా, సౌకర్యాలు అందక ఇంటి బాటవెల్లిన మొత్తం కేజీబీవీ విద్యార్థినీలు

విద్యా, సౌకర్యాలు అందక ఇంటి బాటవెల్లిన మొత్తం కేజీబీవీ విద్యార్థినీలు

1b70588d-8bb0-4468-8f6b-ac23bbae5c24

ప్రభుత్వం తక్షణమే కేజీబీవీలో విద్యార్థులకు క్లాసులు జరిగే విధంగా చూడాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 26.
అన్నపురెడ్డిపల్లి మండలం కేజీబీవీలో టీచర్లు, వర్కర్లు సమ్మెలో ఉండడంతో విద్యార్థినీలు చదువులకు దూరమై క్లాసులు జరక్క, సమయానికి అన్ని సౌకర్యాలు అందక ఇంటి ముఖం పట్టారు. కేజీబీవీ లో చదువు చెప్పేటువంటి టీచర్లు, వర్కర్లు గత 20 రోజులుగా కలెక్టరేట్ వద్ద వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించక టీచర్ల సమ్మెను నిర్లక్ష్యం వహిస్తూ చదువుకునే విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. ఇంకా రెండు నెలల లోనే ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నటువంటి ఈ సమయంలో విద్యార్థులకు విద్య, సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతూ ఇంటి ముఖం పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంకా సిలబస్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అన్నారు. గత కాలంలో టీచర్ల సమ్మెకు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలను నెరవేరుస్తామని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. కావున ప్రభుత్వం స్పందించి టీచర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసి విద్యార్థులకు విద్యను అందే విధంగా చూడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని అన్నారు. కావున ప్రభుత్వం స్పందించి త్వరగా టీచర్ల సమస్యను పరిష్కరించి టీచర్లు విధులకు హాజరయ్యేలా, పిల్లలకు తిరిగి కేజీబీవీ లో క్లాసులు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థుల చదువుల కోసం భారీ పోరాటాలకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పి.పవన్, పాల్గొన్నారు.
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు 
రామ్ చరణ్ 
9573375531.

Views: 1

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని