నూరేళ్లుగా జనం గుండెల్లో సిపిఐది మహొన్నత స్థానం

నూరేళ్లుగా జనం గుండెల్లో సిపిఐది మహొన్నత స్థానం

64049675-9fce-42e2-be6f-8c857cfe29ca

కార్మిక, కర్షక, బలహీన వర్గాలకు ఎర్రనే అండ

ఆధునిక భారతదేశ నిర్మాణంలో సిపిఐ కీలక పాత్ర

దోపిడీ లేని సమాజ నిర్మాణమే సిపిఐ అంతిమ లక్ష్యం

దేశ భవితకు కమ్యూనిజమే మార్గం

ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసేది ఎర్ర జెండానే

సిపిఐ పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి కావాలి

సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెంలో ఘనంగా సిపిఐ శతవార్షికోత్సవాలు

జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శిన..ఎరుపెక్కిన కొత్తగూడెం

జిల్లా వ్యాపితంగా 28 కేంద్రాల్లో ర్యాలీలు..ప్రారంభమైన శత వర్సికోత్చావాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 26.
కొత్తగూడెం బ్రిటిష్ పాలకుల కబంద హస్తాల్లో మగ్గుతున్న భారత దేశానికి విముక్తి కలిగించేందుకు ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని, నూరేళ్ళ పార్టీగా జనం గుండెల్లో సిపిఐ మహొన్నత స్తానం సంపాదించుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోగురువారం భారీ ప్రదర్శన నిర్వనించారు. కూలీలైన్ సూర్యోదయ పాఠశాల సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంజి రోడ్డు, రైల్వే స్టేషన్ సెంటర్, బస్టాండ్ సెంటర్ మీదుగా పోస్టాఫీసు సెంటరుకు చేరుకుంది. ప్రదర్శన అగ్రభాగాన రెడ్ షర్ట్ వాలంటీర్లు వంద జెండాలతో కవాతు నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తల్లో ఎర్ర జెండాలతో ప్రదర్శనలో పాల్గొనడంతో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. పోస్టాఫీసు సెంటరులో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సిపిఐని మొగ్గలోనే తుంచివేయాలని అనేక కుట్రలు పన్నినా ప్రజాబలంతో కుట్రలను ఎదురించి నాటి నుంచి నేటివరకు అజేయంగా నిలిచిందని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఆధునిక భారత దేశ నిర్మాణంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కూడు, నీడ లేని పేదల అభ్యున్నతికి, కార్మికులు, కర్షకుల హక్కులకోసం, ప్రజాస్వామ్య రక్షణకోసం, బాలాజీనా వర్గాల సంక్షేమంకోసం అనేక ఉద్యమాలు నిర్మించిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. దేశంలో కులపీడన మతోన్మాదం, ఆర్ధిక దోపిడీ విస్తృతంగా కొనసాగుతోందని, కార్పొరేట్లకు దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతున్న తరుణంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూఉద్యమాలకు ఊపిరి పోస్తూ దోపిడి లేని సమాజ నిర్మాణంకోసం నిరంతరం సిపిఐ పోరాడుతోందన్నారు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసేది ఎర్ర జెండానేనని, నాటి స్వతంత్ర పోరాటం మొదలు,తెలంగాణ విలీనంకోసం, స్వేచ్చాయుత తెలంగాణ కోసం, కార్మిక, కర్షక, పేదవర్గాల సంక్షేమంకోసం జరిగిన అనేక పోరాటాల్లో సిపిఐ అగ్రభాగాన నిలిచిందన్నారు. వందేళ్లుగా సిపిఐ నిర్వహించిన ప్రజా పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి అని, మరో వందేళ్లైనా సిపిఐ ప్రజలపక్షం వీడబోమన్నారు. సిపిఐ శతవసంతాలను పురస్కరించుకొని జిల్లా  వ్యాపితంగా 28 కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఉత్సావాలను ప్రారంభించడం జరిగిందని, 2025 డిసెంబర్ 25న ఖమ్మంలో ఉత్సవాల ముగింపు సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దమ్మాలపాటి శేషయ్య, ఉదయ్ భాస్కర్,భూక్యా దస్రు, గెడ్డాడు నగేష్, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, భూక్యా శ్రీనివాస్, దీటి లక్ష్మీపతి, మునిగడప వెంకటేశ్వర్లు, రత్నకుమారి, ధనలక్ష్మి, ఎస్ కె ఫహీమ్,యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, ధర్మరాజు, నేరెళ్ల శ్రీనివాస్, సత్యనారాయణాచారి, దుర్గ, సత్యనారాయణాచారి, నేరెళ్ల రమేష్, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని