ఊరు వాడ మతసామరస్యం వెల్లివిరియాలి సమాజహితం కోసం కలిసి ముందుకెళదాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.
కొత్తగూడెం ప్రజాసామ్య భారత దేశంలో కులమతాలకతీతంగా అన్ని పండుగలను కలిసికట్టుగా జరుపుకొని ఐక్యతను చాటాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఫాస్టర్ల సంఘాల సహకారంతో బైబిల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం ప్రధాన రహదారిలో 'వాకింగ్ క్రిస్మస్ ర్యాలీ'ని నిర్వహించారు. ర్యాలీ ప్రారంభ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ అనాదిగా కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజలను కొందరు స్వార్ధ రాజకీయాలకోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఇలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు సేవాభావం, ఆధ్యాత్మికతను అలవర్చుకుంటే సమాజం శాంతియుతంగా ముందుకు సాగుతుందని, త్వద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రతిఒక్కరు సమాజహితం కోసం పాటుపడాలని సూచించారు. వచ్చే క్రిస్మస్ పండుగను క్రైస్తవ కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచనతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చిలవద్ద కలవాల్సిన సదుపాయాలను అధికారులు కల్పిస్తారని తెలిపారు.