రామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర... ఈనెల 17న భాగ్యనగరంలో మొదలైన పాదయాత్ర 30వ తారీకు అయోధ్య.. కోరుట్ల పట్టణంలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు...
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్21:
రామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఈనెల 17వ తేదీన భాగ్యనగరంలో ప్రారంభమైంది ఈనెల 30వ తారీకు వరకు అయోధ్య చేరుకుంటుంది ఇట్టి కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా శనివారం కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ లో గల శ్రీఅష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఇట్టి పాదయాత్రలో పాల్గొని స్వామి వారి పాదుకలను మోస్తూ రామనామ జపం చేస్తూ పాదుకల పల్లకి యాత్ర ను ముందుకు కొనసాగించారు ఇట్టి పాదయాత్రకు విచ్చేసిన భక్తులకు జువ్వాడి నర్సింగరావు బిక్ష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రామరాజ్య స్థాపన కోసం చేపట్టిన రామ స్వర్ణపాదుకల పల్లకి యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు రాముడు ఒక్కరికే దేవుడు కాదని భారత దేశంలోని ప్రతి ఒక్కరికి ఆయన దేవుడని ఆయనను స్మరిస్తూ రామరాజ్య స్థాపన కోసం చేస్తున్న ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగి ఇలాంటి ఆటంకాలు జరగకుండా ముందుకు సాగాలని ఆ శ్రీరాముని వేడుకున్నట్లు తెలిపారు ఈకార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం మెట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లింగారెడ్డి కర్ణాకర్ రావు నేరెళ్ల దేవేందర్ ముత్యాల గంగాధర్ కస్తూరి రమేష్ కట్కమ్ దివాకర్ నేతి శ్రీనివాస్ తునికి సాయి లింగారెడ్డి జంగ స్వామీ యూట్యూబ్ రాజు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు