హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఏడో త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఏడో త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : హ‌యత్‌న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠ‌శాల వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు భారీగా మోహ‌రించారు.

ప్ర‌యివేటు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని హాస్ట‌ల్ గ‌దిలో విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అయితే గ‌ది త‌లుపులు ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో తోటి విద్యార్థుల‌కు అనుమానం వ‌చ్చి హాస్ట‌ల్ సిబ్బందికి స‌మాచారం అందించారు. పోలీసులు, హాస్ట‌ల్ సిబ్బంది క‌లిసి త‌లుపులు విర‌గ్గొట్టి చూడ‌గా, విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యం క‌నిపించింది.

అయితే విద్యార్థి మాన‌సిక ఒత్తిడికి గురై, ఈ దారుణానికి పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థి త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక