పెద్దపూర్ గురుకుల పాఠశాలను తనిఖి చేసిన సురభి నవీన్ కుమార్..

పెద్దపూర్  గురుకుల పాఠశాలను తనిఖి చేసిన సురభి నవీన్ కుమార్..

d8d92f87-0257-4f68-bbab-3357c001036b

అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్20:


జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్   మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గురుకులం అంటే ఇంటికి పారిపోయే  పరిస్థితి నెలకొంది..
ప్రస్తుతం మన కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దపూర్  గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులే తాళంవేసి పిల్లలందరినీ ఇంటికి తీసుకెళ్లిన వైనం చాలా ఘోరమైన పరిస్థితి...
గత 60 ఏళ్లుగా అక్కడే పొలాల మధ్య ఉన్న గురుకుల పాఠశాల ఈ ఏడాది కాలంలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకొని ఇంకెందరో అనారోగ్యానికి కారణమైంది..
ఇంత జరుగుతున్నప్పటికీ 
పిల్లల చదువుగురించి,అక్కడ సౌకర్యాలగురించి,ఉండే వసతులగురించి పట్టించుకునే నాధుడే లేడు..
ఇప్పటికి ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ఇంకా గట్టిగా చెబితే విద్యాశాఖ మంత్రి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది.. 
గత టిఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలు అంటూ కిరాయి బంగ్లాలు తీసుకొని పిల్లల భవిష్యత్తుపై ఆధారంలేని ఆలోచననుచేసి అభివృద్ధి చేశామని చెప్పుకున్నారు ఇప్పటి ప్రభుత్వం ఉన్న పిల్లలను కాపాడుకునే పరిస్థితి లేదు.. 
రెండు ప్రభుత్వాలు తెలంగాణ విద్యా విధానాన్ని బ్రష్టు పట్టించాయి.. 
గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉండాల్సిన పిల్లలు ఈరోజు హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టిన లేని దయనీయ పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం.. 
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని పూటకోసారి ఢిల్లీ వెళ్లడం మానుకొని గురుకుల పాఠశాల బాట పట్టాలని పిల్లల భవిష్యత్తుపై ఆలోచన చేయాలని హెచ్చరిస్తున్నాం అన్నారు,వారితోపాటు బీజేపీ కోరుట్ల నియోజక వర్గ అసెంబ్లీ కన్వీనర్ చెట్లపెల్లి సుఖేందర్ గౌడ్,మేట్ పల్లి మండలం బీజేపీ అధ్యక్షులు రాజ్ పాల్ రెడ్డి, మేట్ పల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు బోడ్ల రమేష్,జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ఇందూరి తిరుమలవాసు,కోరుట్ల నియోజకవర్గానికి చెందిన వివిధ మోర్చాల పధాధికారులు,నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక