యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ.
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్20:
కోరుట్లలో యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరణ కోరుట్ల ఎమ్మార్వో ఇట్యాల కిషన్ చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా కోరుట్ల నర్సింగ్ హోమ్. స్త్రీ వైద్య నిపుణుల అసోసియేషన్, కోరుట్ల మెటుపల్లి అధ్యక్షురాలి డాక్టర్ స్వీతి అనూప్ గారి చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కోరుట్ల ఎమ్మార్వో ఇట్యాల కిషన్, స్త్రీ వైద్య నిపుణుల అసోసియేషన్, కోరుట్ల మెటుపల్లి అధ్యక్షురాలు డా. స్వీతి అనూప్.
క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి, మరియు వారి సామాజిక స్థాయి పెంపునకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది, “మైనార్టీ హక్కులపై అవగాహన పెంచే కార్యక్రమాలు సమాజంలో శ్రేయస్సుకు దోహదపడతాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, "ముస్లింలు తమ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. సామాజిక సమతా సాధనకు ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమైనవి" అని అన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ అనూప్ రావు. నబి తహసిల్దార్. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.