సర్వేనెంబర్ 53/3 గతంలో డివిజనల్ సర్వేయర్ రికార్డ్ ప్రకారంగా సర్వే చేసినారు.
అట్టి భూములను పరిశీలించాలని తాసిల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది
గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.
చర్ల మండలం శుక్రవారం నాడు తాసిల్దార్ కి జి ఎస్ పి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది,
అనంతరం గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ చర్ల జీలో సర్వే నెంబరు 53/3 గతంలో పనిచేసిన ఐ టి డి ఏ పిఓ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని డివిజనల్ సర్వేర్ తో సర్వే జరిపించినారు ఆ యొక్క భూమిలో కొంతమంది గిరినేతరులు కొనుగోలు చేసినామని మరి కొంతమంది పట్టా ఉన్నదని చెబుతున్నందున తాసిల్దారు రికార్డు ప్రకారంగా పరిశీలించాలని విన్నవించినారు ఏజెన్సీలో గిరిజనేతరుల మధ్య భూమి క్రియ విక్రయాలు చట్ట విరుద్ధం అయినప్పటికీ ఆ భూమిని కొంతమంది కొనుగోలు చేశామని చెప్తున్నారు వాస్తవ ఏజెన్సీ రికార్డ్ ప్రకారంగా ప్రభుత్వ భూమిగా రికార్డులో కొనసాగుతున్నది ఈ కార్యక్రమంలో మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు ఇర్ఫా ప్రకాష్ దోర శరం రవీంద్ర. తదితరులు పాల్గొన్నారు