అన్ని ఏరియాలో సర్వేలు నిర్వహించి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మున్సిపల్ మేనేజర్ కి వినతిపత్రం సమర్పించినసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 

అన్ని ఏరియాలో సర్వేలు నిర్వహించి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మున్సిపల్ మేనేజర్ కి వినతిపత్రం సమర్పించినసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16.
పాల్వంచ పట్టణంలో అన్ని ఏరియాలలో సర్వేలు నిర్వహించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ఫాం ని సంక్షిప్తంగా పరిశీలించి,సర్వే చేసి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ ఎల్.వి.సత్యనారాయణ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. 
అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో సర్వేలు నిర్వహించి ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు అండదండలతో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరుగుతుందని వారి కమిటీలు వేసుకొని ప్రజలను అధికారుల దగ్గరికి రాకుండా రాజకీయ నాయకుల వైపు తిప్పుకుంటున్నారని ఇది సరైనది కాదని వారన్నారు.మున్సిపల్ అధికారులు  పట్టణంలోని అన్ని వార్డులలో సర్వేలు నిర్వహించి వచ్చినటువంటి సర్వే ఆధారంగా అర్హులైన వారిని ఎంపిక చేసుకోవాలని ఇండ్లు,ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం మరియు ఇంటి నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.ఏలాంటి అవకతవకలు జరగకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ చేయాలని వారు కోరారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ శాఖ నాయకులు మంకేన వెంకటేశ్వర్లు నరసింహారావు, వై శ్రీను, సిహెచ్ వెంకటేశ్వర్లు,రాజేష్,బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక