టీచర్ల కోసం కేజీబీవీ విద్యార్థినీల నిరసన
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.
స్థానిక చండ్రుగొండ మండలం కేజీబీవీలో టీచర్లు లేరని విద్యార్థులను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ కేజీబీవీ లో టీచర్లు ధర్నాకు వెళ్లడం వలన చదువుకునే విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి టీచర్ లేకుండా పోతున్నారన్నారు. గత 12 రోజులుగా విద్యార్థులకు క్లాసులు జరగడం లేదన్నారు.10వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులు జరగక, సిలబస్ కంప్లీట్ అవ్వక పరీక్షలు దగ్గరకు వస్తున్నాకొద్దీ విద్యార్థులకు టీచర్స్ లేక క్లాసులు జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు.దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రతిపక్ష పార్టీలు గానీ కనీసం స్పందించడం లేదన్నారు. కావున ప్రభుత్వం స్పందించి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి విద్యార్థుల క్లాసులు జరిగే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పి.పవన్, కేజీబీవీ విద్యార్థినులు పాల్గొన్నారు.