హైదరాబాద్ సమావేశానికి బయలుదేరిన ఏడిఎంఎస్ జగిత్యాల జిల్లా ప్రతినిధులు..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్21:
కాలుష్య రహిత సమాజానికి ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్న తరుణంలో ఏడి ఎంఎస్ అని ఎలక్ట్రిక్ బైక్ విప్లవాత్మకంగా. చక్కని ఆకృతి రైతులు, వ్యాపారస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా 18 రకాల మోడల్స్ లో ఒక్కో మోడల్ కు మూడు కలర్ ల తో త్రీ వీలర్, ఆటోలు, కార్లు నాణ్యమైన లిథియం అయాన్ బ్యాటరీ, ఫ్లైట్ లకు వినియోగించే ఫైబర్ పరికరాలతో తయారు చేయబడిన ఎడిఎంఎస్ వాహనాల కొనుగోలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఏడిఎంఎస్ 4 కమిటీ సభ్యులు రచ్చ శ్రీనివాస్ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు బయలుదేరారు. హైదరాబాదులో 3000 మందితో మహా సమావేశాన్ని ఎడిఎంఎస్ ప్రతినిధులు అశోక్, దిలావర్, మహేష్, షాహిన్ ల నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎడిఎంఎస్ ప్రతినిధులు హాజరవుతున్నట్లు పన్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల నుండి కోటీశ్వరుల వరకు అందరూ సంస్థలో భాగస్వామి అవుతున్నారని ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రస్తుత తరుణంలో ఎడిఏమ్ ఎస్ ఎలక్ట్రిక్ బైక్ ల విక్రయాలు చేయడంలో ఎంతో ఆనందంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తొలిగేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నట్లు ఏడియం ఎస్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి వి, శ్రీనివాస్, పన్యాల శ్రీనివాస్,కొండ్ర జగన్, నాచుపల్లి రెడ్డి, నర్సింలు, రత్నాకర్, సోఫీ, సత్యనారాయణ, మల్లేశం, రఘు, లింగారెడ్డి, గంగాధర్ తదితరులు తరలి వెళ్లారు.