విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
తోట దేవి ప్రసన్న
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల నందు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థి విద్యార్థులతో కలిసి సహాపoక్తి భోజనము చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
తోట దేవి ప్రసన్న
దేవి ప్రసన్న విద్యార్థులతో మాట్లాడుతూ తరగతి గదిలో ఎలా ఉంది అడిగి తెలుసుకోవడంతో పాటు శారీరక శుభ్రత కూడా అవసరమని వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది ఆరోగ్యకరమైనటువంటి పోషక ఆహారాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము అందిస్తున్నందుకు మీ మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు పాఠశాల గురించి అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుని అడిగి తెలుసుకున్నారు, మధ్యాహ్నం భోజన వర్కర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణ మరియు మండలాల అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, సావిత్రి, రాజేశ్వరి,సులోచన, మహిళా కాంగ్రెస్ నాయకురాలు హైమావతి, విద్య, విజయలక్ష్మి, సుప్రియ, పూజ ఆదిలక్ష్మి,భాగ్య, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు