పసుపు టీని రోజూ ఉదయం తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..?
పసుపును నిత్యం మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. పసుపును వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. మనకు ఏవైనా దెబ్బలు తగిలి గాయాలు అయినప్పుడు మన పెద్దలు పసుపును పెట్టేవారు. అయితే పసుపులో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. కనుక పసుపును పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. కనుకనే మన పెద్దలు అలా చేసేవారు. అయితే పసుపును చాలా మంది తీసుకోవడం లేదు. కానీ దీన్ని రోజూ ఏదో ఒక విధంగా నేరుగా తినే ప్రయత్నం చేయాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అనేక వ్యాధులను తగ్గించడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపుతో టీ తయారు చేసి తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువుకు..
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి అందులో కాస్త నిమ్మరసం, తేనె జోడించి తీసుకోవచ్చు. ఈ డ్రింక్‌ను ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు తాగవచ్చు. ఇలా పసుపు టీని తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారికి పసుపు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. పసుపు టీని రోజూ తాగుతుంటే ఫలితం ఉంటుంది. పసుపులో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు పసుపు టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో ఈ టీని తాగితే కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
లివర్ క్లీన్ అవుతుంది..
పసుపు టీని ఉదయం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. మూత్ర పిండాలు కూడా శుభ్రమవుతాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. పసుపు టీలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. పసుపు టీని ఉదయం సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ సైతం శుభ్రమవుతుంది. పేగుల్లోని మలం సులభంగా బయటకు వస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
శ్వాసకోశ సమస్యలకు..
చలికాలంలో చాలా మంది ఆస్తమాతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు రాత్రి పూట పసుపు టీని తాగితే మంచిది. దీంతో శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే ముక్కు దిబ్బడ, తలనొప్పి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. పసుపులో కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పసుపు టీని ఉదయం తాగితే మంచిది. దీంతో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. పసుపు టీని తాగితే లివర్ శుభ్రంగా మారి లివర్‌లోని కొవ్వు కరుగుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా పసుపు వల్ల మనం అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజూ తాగడం మరిచిపోకండి.