రోజూ ఒక కప్పు దొండకాయలను తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
మనకు ఏడాది పొడవున్నా అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే కూరగాయలు చాలానే ఉన్నాయి. వాటిల్లో దొండకాయలు కూడా ఒకటి. ఇవి మనకు చవకగానే లభిస్తాయి. దొండకాయలతో చాలా మంది అనేక రకాల కూరలను చేస్తుంటారు. దొండకాయలతో పచ్చడి కూడా చేయవచ్చు. వేపుడు చేసుకోవచ్చు. అలాగే వీటితో మసాలా వంటకాలను కూడా చేయవచ్చు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. బాలింతలకు, జ్వరం వచ్చి తగ్గిన వారికి దొండకాయ కూరను పథ్యంగా పెడుతారు. అయితే దొండకాయలను రోజూ ఒక కప్పు మోతాదులో తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దొండకాయలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అనేక పోషకాలను అందించడంతోపాటు రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి.
డయాబెటిస్ సమస్యకు..
షుగర్ ఉన్నవారికి దొండకాయలు వరమనే చెప్పవచ్చు. దొండకాయలను రోజూ తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. వీటిని తినడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు దొండకాయలను తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ కాయల్లో ఉండే సమ్మేళనాలు కిడ్నీ స్టోన్లను కరిగిస్తాయి. మూత్రాశయ వ్యాధులను తగ్గిస్తాయి. దొండ ఆకులను పేస్ట్‌లా చేసి వాటితో ట్యాబ్లెట్లను తయారు చేసి వాడితే బ్యాక్టీరియాతో ఏర్కపడే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శ్వాసకోశ సమస్యలకు..
దగ్గు, జలుబును తగ్గించడంలోనూ దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తింటుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తగ్గుతుంది. దీంతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దొండకాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నిరోధించవచ్చు. దొండకాయల్లో పీచు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక ఉదయం ఈ కాయలను తింటే రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు. అలాగే నీరసం, అలసట, బద్దకం అనేవి ఉండవు. ఈ కాయలను తింటే కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థ పనితీరుకు..
దొండకాయలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుఏంది. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు దొండకాయలను తింటే ఫలితం ఉంటుంది. దొండకాయల్లో అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి బయట పడతారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దొండకాయల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా దొండకాయలను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.