ముఖంపై ఉండే మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలను పాటించండి చాలు..!
Beauty Tips
ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టుకునేందుకు చాలా మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. ఇందుకు గాను ఖరీదైన సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని దీర్ఘకాలంలో ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటి వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక కాస్మొటిక్స్‌ను వీలైనంత తక్కువ వాడాలి. లేదా పూర్తిగా వాడడం మానేస్తే మంచిది. అయితే మరి ముఖంపై ఉండే మచ్చలను ఎలా తొలగించాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అందుకు గాను పలు సహజసిద్ధమైన చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలుగడ్డలతో..
ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడంలో ఆలుగడ్డలు ఎంతగానో దోహదపడతాయి. ఆలుగడ్డలను కట్ చేసి మచ్చలున్న చోట పెట్టి కాసేపు వదిలేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆలుగడ్డను గుజ్జుగా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి మచ్చలు ఉన్న చోట రాసి పావు గంట వదిలేయాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే కాస్త మజ్జిగ, రెండు టీస్పూన్ల టమాటా జ్యూస్‌ను కలిపి ముఖానికి రాసుకోవాలి. పావు గంట తరువాత శుభ్రం చేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
పెరుగు, నిమ్మరసం..
ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కొద్దిగా నిమ్మరసం వేసి మచ్చలు ఉన్న చోట అప్లై చేసినా స్కిన్ టోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఓట్స్‌ను గ్రైండ్ చేసి రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖంపై మర్దనా చేస్తుండాలి. పావు గంట తరువాత నీటితో కడిగేయాలి. వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే 2 డేబుల్ స్పూన్ల పాలలో ఒక టీస్పూన్ తేనె వేసి దూదితో మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషాల తరువాత క్లీన్ చేయాలి. ఈ చిట్కా మచ్చలను త్వరగా పోగొడుతుంది. పాలలో ఒక టీస్పూన్ పసుపు వేసి ఉపయోగించినా ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జుతో..
కలబంద గుజ్జును వేళ్లతో నెమ్మదిగా మచ్చలు ఉన్న చోట మసాజ్‌లా చేసుకోవాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయిని గుజ్జుగా చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి ముఖానికి రాసుకోవాలి. పావు గంట తరువాత కడిగేయాలి. మచ్చలు ఉన్న చోట రోజుకు రెండు మూడు సార్లు ఉల్లిపాయత రబ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.