లగచర్ల రైతులను విడుదల చేయాలని వినతి పత్రం
అక్షర గెలుపు, హుజూరాబాద్ డిసెంబర్ 17:
హుజూరాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల రైతులను విడుదల చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మార్వో కనకయ్యకి మంగళవారం రోజున వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరమని, రైతులను అరెస్టు చేసి ఆసుపత్రికి తీసుకు వెళ్లే సందర్భంలో సంకెళ్లు వేయడం దుర్మార్గం అయిన చర్య అని తెలిపారు. ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నెముక అని, అన్నం పెట్టే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షులు సంఘం ఐలయ్య, కౌన్సిలర్లు వెన్నంపల్లి కిషన్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కొండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.