స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలి
బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్
అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్16:హుజూరాబాద్ పట్టణంలో సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ కూడలి ముందు బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్, రాష్ట్ర కార్యదర్శి సందేల వెంకన్న,రాష్ట్ర కార్యదర్శి ఇప్పాకాయల సాగర్, జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి బీసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షత వహించినారు. ఇట్టి సమావేశంలో బిఆర్ఎస్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు జీవీ కృష్ణారావు, కరీంనగర్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ టాకు రవీందర్ సింగ్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్, హుజూరాబాద్ మునిసిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సొల్లు బాబు, టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక శ్రీనివాసు,జెడిఎస్ నాయకులు వడ్లూరి వాసు, ఆలేటి రవీందర్, కట్కూరి రాజేందర్, న్యాయవాది ముక్కెర రాజు, కొత్తూరి రమేష్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, ఇంద్ర, ఇమ్రాన్,ఇమ్రాన్ కుమార్, యాదవ్ కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ నిరోషా కిరణ్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి లో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రానున్న స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి తమ మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే విధంగా బీసీలకు అన్ని రంగాలలో న్యాయం జరిగే విధంగా ఈనాటి ప్రభుత్వము చేయూతనివ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో దీక్ష భూమి నా నాయకులు భాస్కర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వి మధుసూదన్, రాజ్ స్టేట్ ప్రధాన కార్యదర్శి జింఖాల లక్ష్మణరావు, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, చింత శ్రీనివాస్, బీసీ నాయకులు సబ్బని రాజేందర్, ఉప్పు శ్రీనివాస్, ఆలేటి రవీందర్, వెన్నం రాజేందర్, సాగర్, కూరపాటి రామచందర్, సదానందం, కళాకారులు రామ్, రాజేశ్వర్, నవీన్, పలువురు పాత్రికేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.