అయ్యప్ప జాతర కరపత్రం ఆవిష్కరణ..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్20:
కోరుట్ల పట్టణంలో వెలసిన అయ్యప్ప ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27వ తేదీ శుక్రవారం రోజున అయ్యప్ప జాతర కరపత్రం ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రాముశర్మ ఆవిష్కరించారు.ఇట్టి జాతరలో ఉదయం అయ్యప్ప మూల విరాట్టుకు మహా అభిషేకాలు, గణపతి హోమం అనంతరం దివ్య పదునెట్టాంబడి పూజ,రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ జాతర సందర్భంగా నిర్వహించే మహా అన్న ప్రసాద వితరణలో భక్తులు,స్వాములు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అన్న ప్రసాద వితరణలో సేవా సంస్థల సభ్యులు,యువజన సంఘ సభ్యులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రచార,సహాయ కార్యదర్శులు చలిగంటి వినోద్ కుమార్,కాసు క్రాంతి,ఉపాధ్యక్షులు నిమిషకవి నాగరాజు, గౌరవ సలహాదారులు,గడ్డం మధు,మర్రి పెల్లి రవి గౌడ్,గాజెంగి లక్ష్మీపతి, అల్వాల శ్రీనివాస్,నేతి శ్రీకాంత్,వాన్కార్ రాజు,కల్లూరి సాయి,దీక్షా స్వాములు పాల్గొన్నారు.