విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి

6528500a-bfd7-49c1-ab4c-f9d42e90eae4

రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల

విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తూనే, క్రీడల్లోనూ ప్రతిభ చాటి, జాతీయస్థాయి గుర్తింపు పొందాలని 

రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.
పాల్వంచ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో భాగంగా శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శ్రీనివాస కాలనీలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. కె టి పి ఎస్ విద్యుత్ కళాభారతి లో ఫుట్ బాల్ పోటీలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ క్రీడల వలన శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *పేరును జాతీయస్థాయిలో నిలపాలని కొత్వాల అన్నారు. 
అథ్లెటిక్స్ లో నేషనల్ లెవెల్ లో రెండవ స్థానం పొందిన శ్రీతేజ ను అభినందించిన కొత్వాల, క్రీడాసంఘాలు, అధికారులు
ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ లో రెండవ స్థానం పొందిన, జిల్లాకు చెందిన టి శ్రీతేజ ను కొత్వాల తోపాటు పలువురు అభినందించారు టి శ్రీతేజ కు పథకం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. 
ఈ కార్యక్రమాల్లో డి వై ఎస్ ఓ పరంధామరెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ (ఎడ్యుకేషన్) జి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ కె సుజాత, ఫరీద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డి ఆర్ జి యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, చైర్మన్ కె మహిధర్, కార్యదర్శి ఆర్ రాజేంద్రప్రసాద్, జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీదేవి, గిరిజన నాయకులు ఆరెం ప్రశాంత్, కోచ్ నాగేందర్, ఫుట్ బాల్ కోచ్ ప్రేమ్ కుమార్, కచ్చా నరేష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక