పాల్వంచ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంగరంగ వైభవంగా సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు.

పాల్వంచ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంగరంగ వైభవంగా సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు.

 

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.పాల్వంచ స్పోర్ట్స్ కాంప్లెక్స్,శ్రీనివాస కాలనీ నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన 5 వ రోజు సీఎం కప్/2024 అథ్లెటిక్ పోటీలు జిల్లా లోని వివిధ ప్రాంతాలనుండి 1500 పిల్లలు,వివిధ అథ్లెటిక్ విభాగాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పాల్వంచ మునిసిపల్ కమిషనర్ సుజాత,రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
విశిష్ట అతిథులుగా డి వై ఎస్ ఓ పరంధామరెడ్డి, నాగసీతరములు, సాబీర్ పాషా,ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.యుగంధర్ రెడ్డి ,సింగరేణి జీఎం జి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు  మాట్లాడుతూ ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉందని అన్నారు ఇలాంటి పోటీలు మరెన్నో జరుపుకోవాలని కోరారు.ఇంతచక్కటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు 
మునిసిపల్ కమిషనర్ సుజాత  మాట్లాడుతూ పాల్వంచలో ఇలాంటి ఆటలపోటీలు నిర్వహించడం అభినందనీయమని,మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. టిపిసిసి సభ్యులు
నాగసీతరములు మాట్లాడుతూ 
కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు మరియు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లలకు పోటీతత్యం చిన్నపాటినుండే అలవాటుఅయుతుంది అని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్.కె
సాబీర్ పాషా  మాట్లాడుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని అదేవిధంగా 75 లక్షతో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు,ఈ ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను 
డి వై ఎస్ ఓ పరంధామరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  పిల్లల మంచి భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ,క్రీడలో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు 
జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి,జిల్లా అధికారులు కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ యొక్క క్రీడ ప్రాంగణంలో ఇప్పటినుండి అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచ్ నాగేంద్ర ని నియమించి శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు,పోలీస్ మరియు ఆర్మీ సెలక్షన్స్ కోసం శిక్షణ కోసం కూడా ఈ శిక్షణ ఉంటుంది అని తెలిపారు 
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్,అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్,ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వై. వెంకటేశ్వర్లు, కోశాధికారి పి.కాశీ హుస్సేన్, బి ఎన్ రమేష్,ఆదినారాయణ సింగరేణి ఉమెన్స్ కాలేజీ పీడీ సావిత్రి,మునిసిపల్ ఇంజనీర్ ఫరీద్, జిల్లా కోచ్ నాగేంద్ర,స్థానిక నాయకులు,ప్రశాంత్,కుంపటి శివ, వీసంశెట్టి పూర్ణచందర్రావు
పిడి లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక