కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష నేతగా జమలయ్య
ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తా జమలయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16.
కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ సిపిఐ పక్ష నాయకుడిగా రామవరం ఏరియా, పంజాబ్ గడ్డ, 8వ వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు జమలయ్యను సిపిఐ పక్ష నాయకుడిగా నియమిస్తూ సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జారీచేసిన ఆమోద లేఖను సిపిఐ పక్ష కౌన్సిలర్ బృందం సోమావారం కొత్తగూడెం మున్సిపల్ కమిషనరుకు అందించారు. ఈ సందర్బంగా జమలయ్య మాట్లాడుతూ తనను సిపిఐ పక్షాన నేతగా ఎంపిక చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సిలర్ సమావేశంలో చేర్చించేందుకు వెసులుబాటు లభించిందని అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. సహా కౌన్సిలర్ల సహకారంతో ప్రజా సమస్యలను సేకరించి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి పరిస్కారానికి కృషి చేస్తానని తెలిపారు.