శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో గణితం మేధస్సు పరీక్ష
అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 18:
హుజూరాబాద్ డివిజన్ పరిధిలోనీ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఈ నేల 22 వ తేదిన
గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవ వేడుకలలో భాగంగా శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజూరాబాద్ వారి నేతృత్వంలో తేదీ 20 డిసెంబర్ 2024 రోజున మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు గణిత మేధస్సు పరీక్ష నిర్వహించబడుననీ కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇట్టి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 3000, ద్వితీయ బహుమతిగా 2000, తృతీయ బహుమతిగా ఒక వెయ్యి ఇవ్వబడుననీ, తెలిపారు. కావున తల్లిదండ్రులు గణిత అధ్యాపకులు తమ పిల్లలను ప్రోత్సహించాలని మరిన్ని వివరాలకు శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, 9502372382 నంబర్ నందు సంప్రదించగలరని, ఇట్టి పరీక్ష ఫలితాల విడుదల 22 డిసెంబర్ 2024 రోజున విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడుతుందనీ తెలిపారు.