అదానీ జగన్‌నే కాదు.. మిమ్మల్ని కూడా కొన్నారా.. చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ షర్మిల

అదానీ జగన్‌నే కాదు.. మిమ్మల్ని కూడా కొన్నారా.. చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ షర్మిల

 ఏపీ మాజీ సీఎం జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యకు ఏం సమాధానం చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మౌనంగా ఉంటున్నారంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నట్లేనా అని నిలదీశారు. సక్రమం కాబట్టే రద్దు చేయలేదని చెప్పకనే చెబుతున్నారా అని ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్పా.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా అంత తూచ్‌ కిందనేనా అని అడిగారు. అదానీ జగన్‌నే కాదు మిమ్మల్ని కూడా కొన్నారని చెబుతారా ? ముడుపులు వాళ్ళకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా ? అందుకేనా ACB ని పంజరంలో బంధించారని నిలదీశారు ఇందుకేనా అదానీపై ఒక్క మాట కూడా లేదు ? ఇదేనా బాబు గారు మీ 40 ఏళ్ల రాజకీయం అని అడిగారు.

రూ.1750 కోట్ల లంచాలు తీసుకొని, రాష్ట్ర ప్రజల నెత్తిన 1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలు చేసే డీల్ పై మీరు మౌనంగా ఉన్నా… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమాన్ని ఆపదని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, న్యాయబద్ధంగా కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము సిద్ధమని తెలిపారు. ఇప్పటికైనా డీల్ రద్దు చేసి.. 1750 కోట్ల ముడుపుల పై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Views: 1

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక