అధిక బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే ఈ ఆహారాలను తినడం మరిచిపోకండి..!
అధిక బరువును తగ్గించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఏ ఆహారం పడితే దాన్ని తింటే బరువు తగ్గరు సరికదా, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అధికంగా బరువు ఉన్నవారు వ్యాయామంతోపాటు తినే ఆహారంలోనూ అనేక మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బరువు తగ్గుతారు. ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఇక బరువు తగ్గేలా చేసేందుకు పలు ఆహారాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తింటే శరీర మెటబాలిజం పెరగడంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. ఇవి కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గేలా చేస్తాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లు, కోడిగుడ్డు..
క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను క్యారెట్లు తగ్గిస్తాయి. రోజూ ఒక క్యారెట్‌ను తింటున్నా లేదా ఒక కప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగినా కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కనుక క్యారెట్లను రోజూ తినాలి. అదేవిధంగా కోడిగుడ్డును రోజుకు ఒకటి ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు తగ్గుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో ఉండే విటమిన్ బి12 కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తింటే ప్రయోజనం ఉంటుంది.
పసుపు..
రోజువారి ఆహారంలో పసుపును చేర్చుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రాత్రి పూట కొవ్వు తీసిన గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి రోజూ తాగుతుండాలి. పసుపులో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటర గుణాలు ఉంటాయి. దీంతో శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. పసుపును రాత్రి పూట తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మనం నిద్రలో ఉన్నా కూడా మన శరీరం కొవ్వును కరిగిస్తుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే పసుపు గుండెకు కూడా మేలు చేస్తుంది. బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి పసుపు కలిపిన పాలను రోజూ తాగుతుండాలి.
కరివేపాకులు, ఆవనూనె..
అధిక బరువు తగ్గించడంలో కరివేపాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ ఉదయం గుప్పెడు కరివేపాకులను నేరుగా అలాగే తింటుండాలి. లేదా కరివేపాకులతో తయారు చేసే టీని కూడా తాగవచ్చు. కరివేపాకులను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల జుట్టు సమస్యలు కూడా ఉండవు. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అలాగే బరువును తగ్గించడంలో ఆవనూనె అద్భుతంగా పనిచేస్తుంది. వారంలో కనీసం 2 సార్లు ఆవనూనెతో శరీరాన్ని మర్దనా చేయాలి. తరువాత గంట సేపు ఉండి స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శరీరంలో పేరుకుపోయిన ఎంతటి మొండి కొవ్వు అయినా సరే కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
క్యాబేజీ, మొలకెత్తిన పెసలు..
క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకున్నా కూడా కొవ్వును కరిగించుకోవచ్చు. అధిక బరువు తగ్గుతారు. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచన మేరకు క్యాబేజీని తినడం మంచిది. అదేవిధంగా మొలకెత్తిన పెసలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు. ఇవి శరీరంలోని కొవ్వును కడిగేసినట్లు క్లీన్ చేస్తాయి. మొలకలను రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుండాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.