అందరికీ ఆరోగ్యం అందేది ఎప్పుడు?
75 సంవత్సరాల స్వతంత్ర భారత్ లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ విధ్య' ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్య ' ఆరోగ్య రంగములో సాధించిన ప్రగతి ఫలాలు పేదవర్గాలకు చేరువ కాకపోవడం వల్ల ఆధునిక వైద్య సేవలు అందని ద్రాక్ష అయ్యాయి.
ఉచిత వైద్య ఆరోగ్య సేవలు పేద వర్గాలకు ఆశించిన మేరకు అందుబాటులో లేవు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ ఆరోగ్యం
అందరికీ ఆరోగ్యం దిశగా అడుగులు వేయడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రాథమిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి .ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ప్రజలందరికీ (కుల' మత' ప్రాంత వర్గ బేధాలు లేకుండా ) సమానమైన నాణ్యమైన కనీస ఆరోగ్య సేవలు ఇంటికి దగ్గరగా అది తక్కువ ధరలో అందుబాటు లోకి రావాలి. ప్రాథమికంగా అందించే వైద్య సేవలు సాంస్కృతికంగా ప్రజలకు ఆమోదయోగ్యమై ఉండాలి. ప్రజలు అనారోగ్యానికి కారణం అవుతున్న వివిధ రంగాలను సమన్వయపరిచి ఒకే వేదికపైకి తీసుకురావాలని ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలన్నీ అందరికీ ఆరోగ్యన్ని అందించాలనే లక్ష్యం చేరుకోవడానికి ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయంతో ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సభ్య దేశాల ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు సమన్వయముతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది.
ప్రపంచీకరణ ప్రజారోగ్యం
ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పోరేట్ ప్రపంచానికి దగ్గరగా జీవిస్తున్న ఆధునిక మానవుడు పోటీ ప్రపంచములో ఆరోగ్యకరమైన అలవాట్లు మానుకొని మానవీయ విలువలు లేని మాయా ప్రపంచం లో కొట్టుకుపోయి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల దీర్ఘకాలిక ప్రాణాంతక రోగాలకు బలై మృత్యువాత పడుతున్నారని పలు ఆరోగ్య వైధ్యసర్వేలు వెల్లడిస్తున్నాయి.
*ఆరోగ్యం నిర్వచనం * ఆరోగ్యం అంటే ఏ రోగం లేకుండా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యం అంటే ఒక సంపూర్ణమైన ఆరోగ్యకరమైన శారీరక మానసిక.సామాజిక సాంస్కృతికంగా ఉత్తమ మనుషులుగా ఎదిగి సాటి వారికి మనిషులకు ప్రాణులకు ఉపయోగపడటం.
ఆరోగ్యకరమైన జీవన శైలి
శారీరక వ్యాయామం' యోగ జీవన శైలి లో భాగం కావాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించక పోవటం వల్ల రోగాలు మన జీవితాలను శాసిస్తున్నాయి.
ప్రకృతికి దగ్గరగా జీవించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రపంచ ప్రజలను వ్యాధుల వారి నుండి సురక్షితంగా ఉంచడానికి బలహీనవర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఐక్యరాజ్యసమితి స్థాపించిన సంస్థ. ప్రపంచంలో ఎవరు ఏ మూల ఉన్నా కూడా వారికి అత్యున్నత ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కరోనా వంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో అన్ని దేశాలకు దిశ నిర్దేశనం చేసి ఆరోగ్య సేవలను సమన్వయ పరిచింది. ప్రస్తుతం ప్రపంచంలోని 194 దేశాలలో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 75 వ వార్షకోత్సవం జరుపు కుంటుంది.
*డబ్లు. టీ .వో నినాదం అందరికీ ఆరోగ్యం.*అనే నినాదాన్ని ఎంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లోఆరోగ్యం పై అవగాహన ఆరోగ్య సంరక్షణ కు పాటించవలసిన జాగ్రత్తలగురించి ఆరోగ్య విధానాల మీద చైతన్యం పెంచడానికి కృషి చేస్తుంది.
భారత దేశం ప్రజారోగ్యం
భారతదేశంలో దక్షిణ రాష్ట్రాలు కేరళ 'తమిళనాడు' కర్ణాటక' ఆంధ్ర ప్రదేశ్' తెలంగాణ 'మహారాష్ట్రలో ఆరోగ్య సూచీలు ఉత్తర భారతదేశం రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ ప్రజల్లో వున్న చైతన్యం విద్యా విధానం అందుబాటులో ఉన్న వనరులు కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన ఎన్. ఎఫ్. హెచ్ ఎస్ .వి లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 69 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరోగ్యానికి ముఖ్యమైన పైపు నీటి సరఫరా సదుపాయం కేవలం 22%మందికి మాత్రమే అందుబాటులో ఉంది .ఇంకా సురక్షితంగా కానీ పోయి మీద (కట్టెలు' బొగ్గు 'పిడుకలు) ఉపయోగించి వంట చేసుకునే ఇండ్లు 16 శాతం ఉన్నాయి .గ్రామీణ ప్రాంతాల్లో 22% ఇళ్లలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు.
మహిళల ఆరోగ్య విషయంలో 30% మంది మహిళలకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి అవుతుంది. బాల్య వివాహాలు జరుగుతున్నాయి .ఈ వయసులో ప్రత్యుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా గర్బం దాల్చుతున్నారు .దీని వలన నవజాత శిశువుల మరణాల సంఖ్య పెరుగుతుంది. మహిళల్లో 15% మంది పోషకాహార లోపం తో బాధపడుతుంటే 36% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. రెండు సంవత్సరాల లోపువయసు ఉన్న పిల్లలకు 25% టీకాలు సరిగా ఉండడం లేదు. ఐదు సంవత్సరాలు ల్లోపు వయసు ఉన్న పిల్లల్లో 30 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పురుషుల్లో ప్రతి ఐదుగురిలోఒకరికి మహిళల్లో ప్రతి పదిమందిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంది. ప్రతి పది మందిలో ఒకరికి మధుమేహం ఉంది .ప్రతి ఐదుగురు పురుషుల్లో పొగ తాగడం పొగాకు తినే అలవాటు ఉంది ప్రతి ముగ్గురిలో ఒకరికి మందు తాగే అలవాటు వుందని సర్వేలు చెబుతున్నాయి.
గిరిజనులకు ఆధునిక వైద్య ఆరోగ్య సేవలు నేటికి అందుబాటులోకి రాలేదు. రవాణా సౌకర్యాలు లేక సకాలములో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని పలు ఆరోగ్య వైద్య సర్వేలు వెల్లడిస్తున్నాయి.
*ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు *
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి..ఆరో
గ్య ఉప కేంద్రాలు సామాజిక.ఆరోగ్య కేంద్రాలు (కమ్యూనిటీ హేల్త్ సెంటర్స్ ఏరియా ఆసుపత్రులు) ఆరోగ్య సిబ్బందిని నియమించాలి.
మౌలిక సదుపాయాలు కల్పించాలి. 24 గంటలు వైద్య ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలుగా మార్చాలి.
ఆరోగ్య కేంద్రాలలో పూర్తి స్థాయిలో సిబ్బందినీ నియమించాలి. ఆరోగ్య కేంద్రాలలో రోగులకు శుచి రుచి కరమైన పౌష్ఠికాహారం అందించాలి.
ఆరోగ్య హక్కు హర్షణీయం*
పెట్టుబడిదారీ విధానం లో ప్రజారోగ్యం కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూర్చే మార్కెట్ సరుకుగా మారింది .కరోనా కాలములో జనాల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ కోసం పడ్డ ఇబ్బందులు చూసి రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్య హక్కు హర్షణీయం
మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. చుట్టూ ఉండే గాలి నీరు నీలం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఉన్నంతకాలం ప్రజలను ఉద్యోగం పేరుతో పోటీ పేరుతో ఎంతో ఆందోళనకు గురిచేసే కార్పొరేట్ సంస్థ ఉన్నంతకాలం అసలు కనీస ఆహారము నివాసము పని ఆరోగ్య సేవలు కల్పించలేని ప్రభుత్వాలు ఉన్నంత కాలం సంపూర్ణ శారీరక మానసిక సామాజిక ఆరోగ్యం సాధ్యపడదు. మనిషిని వోటు వేసే యంత్రాంగ చూసే రాజకీయాలు మారాలి..ప్రజారోగ్యాన్ని కి పెద్ద పీట వేసే పార్టీలకు ప్రజలు తమ వోటు ద్వారా అధికారాన్ని కట్టిపెట్టాలి.
ప్రజా ప్రతినిదులు ప్రతి 3.నెలకు ఒక్ సారి తమ నియోజక వర్గ పరిధిలో ప్రజారోగ్య సదస్సులు నిర్వహించాలి .ప్రజారోగ్య వ్యవస్థ నిర్వహణ పనితీరును సమీక్షించాలి . ఆరోగ్య రంగములో మౌలిక వసతుల కల్పన కు కృషి చెయ్యాలి. అప్పుడు.మాత్రమే ఆరోగ్యమనేది నినాదంగా మిగిలి పోకుండా విధానంగా కొనసాగుతుంది. అందరికీ ఆరోగ్యం లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం సామ్యవాద సమాజం వైపు అడుగులు వేయాలి.
ఆరోగ్య హక్కు అనేది ప్రతి.మనిషికి వుండే ప్రాథమిక హక్కు.
ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సేవలు ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందె అవకాశం ఉండాలి. ప్రపంచంలో 30 శాతం ప్రజలకి అత్యవసర సేవలు అందుబాటులో లేవు . ప్రతి సంవత్సరం ఆరోగ్యంపై చేసే ఖర్చులతో 20 లక్షల మంది దారిద్రరేఖ దిగువకు జారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య హక్కు చట్టం తేవడం హర్షణీయం . మనిషికి ఈచట్టం కింద వ్యక్తి ఉండే రకరకాల ఆరోగ్య హక్కులను పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ ఆసుపత్రి వర్గాల నుండి తెలుసుకునే హక్కు అత్యవసర సేవలు పొందటా నికి అందుబాటులో ఉన్నప్రైవేటు ఆసుపత్రిలో ముందస్తు డబ్బులు చెల్లించకుండానే వినియోగించుకునే హక్కు అధిక ప్రమాణాలు తో ట్రీట్మెంట్ ఉచిత రవాణా హక్కు పేషెంట్ మరణించినప్పుడు ఆస్పత్రి ఖర్చులు చెల్లించారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లే హక్కు మొదలైనవి ఇందులో కల్పించారు ఈ హక్కులను సంబంధించి న వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది .కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఈ చట్టం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు
ఈ చట్టం అమలు అవుతే అందరికీ ఆరోగ్యం అనే ది నినాదం కాకుండా
ఒక.విధానంగా కొనసాగుతుంది
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజారోగ్యం మీద బడ్జెట్ ఎక్కువ కేటాయించి మానవ వనరుల సంరక్షణకు సమగ్రమైన ప్రజారోగ్య అభివృధి వ్యూహాలను రూపొందించింది అమలు.చెయ్యాలి.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నాణ్యమైన మందుల తయారీకి బాధ్యత వహించాలి
నకిలీ. మందుల తయారిని అడ్డుకోవాలి.
ఫార్మా కంపెనీలు కార్పొరేట్ ఆసుపత్రులు డాక్టర్లు ఏర్పాటు చేసుకున్న షాప్స్.నుండి మందులు కొనకుండా చర్ర్యలు తీసుకోవాలి
మందుల విక్రయాల.మీద ప్రభుత్వ అధికారుల నుంచి నిఘావుండాలి
జనరిక్ పేరుతో మాత్రమే మందులు విక్రయించే విధానం అమలు చెయ్యాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. అనవసరమైన మందులు అధిక ఖరీదు వున్న మందులు రాయకుండా మెడికల్ కౌన్సిల్ జాతీయ విధానాన్ని అమలు చేయాలి.
గ్రామ పంచాయితీ లలో వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ మహిళా సంఘాలు ఆరోగ్య కార్యకర్తలు ప్రతి వారం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కల్పించాలి.ఆరోగ్య అక్షరాస్యత పరివ్యాప్తిలో ప్రజలు క్రియాశీల భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణ ప్రజా ఉద్యమాన్ని
నిర్మించాలి .ప్రభుత్వం ఉచిత వైద్యం ఉచిత విద్య ను ప్రాధాన్య రంగంగా ఎంపిక చేసుకొని అభివృధి పరచాలి.ఆహారభద్రత హక్కు అందరికీ పౌష్ఠికాహారం అంధించే మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థతోనే మానవ వనరుల మనుగడకు ప్రభుత్వం ఉపక్రమించాలి.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771