గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
ఆదివాసులు సాగు చేస్తున్న భూమికి హక్కు కల్పించాలి జి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ
పోలీస్ అధికారులు సిఆర్పిసి 145 సెక్షన్ ఎత్తివేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16.
వెంకటాపురం కొమరం భీమ్ కాలనీ ఆదివాసుల భూ పోరాటానికి నేడు వెంకటాపురం మండలం తాసిల్దార్ కార్యాలయం ఎదుట గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే నిహార దీక్షలకు శ్రీకారం చుట్టింది కొమరం భీం కాలనీ ఆదివాసి సాగు చేస్తున్న భూమిపై సి అర్ పి145 సెక్షన్ పెట్టి ఆదివాసి కుటుంబాలను చిన్నాభిన్న చేస్తున్నారని,ఇది ఏజెన్సీ చట్టాలకు విరుద్ధమని రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు.
వెంకటాపురం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీ ఆదివాసుల పక్షాన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ దీక్షను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ. వెంకటాపురం కొమరం భీమ్ కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న,ఆదివాసీలు గతంలో ములుగు సబ్ కలెక్టర్ గా పని చేసిన విపీ గౌతమ్,ఆ యొక్క భూమిలో దిమ్మలు ఏర్పాటు చేసినారని తెలిపారు,మండలంలో కొంతమంది వలస గిరిజనేతరులు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అధికారులను ఒత్తిడికి గురిచేస్తూ ఆ యొక్క భూమిలో పంట వేసిన ఆదివాసీలు ఆ భూమి లోకి వెళ్లకుండా సి ఆర్ పి సి సెక్షన్ 145 విధించి ఆదివాసులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు.
ఏజెన్సీలో అధికారులు ఆదివాసుల హక్కుల కోసం మరియు ఆదివాసుల సంక్షేమం కోసం పనిచేయాలని అన్నారు.అధికారులు రాజకీయ పార్టీల నాయకుల మాటలు వింటున్నారని, ఆదివాసి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని,ఏజెన్సీ చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అధికార యంత్రాంగం నడుచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు.అలాంటి అధికారులు ఏజెన్సీలో పని చేయకుండా వెళ్లిపోవాలని, అలాగే వాడగూడెం (జీ) సర్వేనెంబర్ 27 భూమిపై మరియు వ్యక్తులపై పెట్టిన 145 సెక్షన్ వెంటనే తొలగించి,సాగు చేస్తున్న కొమరం భీమ్ కాలనీ వాసులకు భూమిపై హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి,ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్,ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ,వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్,పూనెం మునేశ్వరావు, కొమరం భీం కాలనీ వాసులు తాటి లక్ష్మణ్,ఉమేష్,శ్యామల మగ్గయ్య,రమేష్,బిమ్మయ్య,సుశీలశాంత,సీత తదితరులు పాల్గొన్నారు