కార్మిక రత్న జాతీయ అవార్డు అందుకున్న రాసూరి శంకర్ 

కార్మిక రత్న జాతీయ అవార్డు అందుకున్న రాసూరి శంకర్ 

 

దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక కార్మిక రత్న జాతీయ అవార్డు అందుకున్న సింగరేణి కార్మిక నేత 

శంకర్ కి పలువురి శుభాకాంక్షలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16. 
కొత్తగూడెం చుంచుపల్లి మండలం  గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీకి చెందిన సింగరేణి కార్మిక నేత  ఆల్ ఇండియా ఎస్ సి ,ఎస్ టీ  రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సింగరేణి బ్రాంచ్ అధ్యక్షులు రాసూరి శంకర్ కు  బహుజన సాహిత్య అకాడమీ బి ఎస్ ఏ వారు అత్యంత ప్రతిష్టాత్మక కార్మిక రత్న జాతీయ అవార్డును దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవన్ లో దివంగత నేత  బహుజన సమాజ్ పార్టీ జాతీయ నాయకులు కాన్షీ రామ్ సోదరీమణి బీబీ స్వరణ్ కౌర్ జీ, ఢిల్లీ శాసనసభ్యులు వికేష్ రవిజీ, మున్వీర్ సింగ్ పర్చా ల చేతుల మీదుగా అవార్డును ప్రశంస పత్రాన్ని అందజేయటంతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్ సి, ఎస్ టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవలకు, సామాజిక కార్యకర్తలకు , రచయితలకు, కవులకు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా  దేశ రాజధాని న్యూఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ ఐదవ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని రాధాకృష్ణ తెలిపారు. సింగరేణి కార్మిక నేత రాసూరి శంకర్  కార్మిక వర్గానికి చేస్తున్న నిస్వార్ధ సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మక కార్మిక రత్న జాతీయ అవార్డును ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు, ఓబి వర్కర్లకు శంకర్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.అవార్డు గ్రహీత రాసూర్ శంకర్ కి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ఓబి వర్కర్లకు మరింత చేరువయ్యే విధంగా తన సేవలను మరింత విస్తృతపరిచే విధంగా వారి హక్కుల సాధనకై తన టీం ఎల్లవేళలా  అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. అవార్డును తన అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్లుగా శంకర్ తెలిపారు. తన సేవలను గుర్తించి జాతీయ అవార్డుతో తనను సత్కరించిన బహుజన సాహిత్య అకాడమీ సంస్థకు జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ కి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నల్లా జ్యోతి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రాసూరి శంకర్ కి కార్మిక రత్న జాతీయ అవార్డు అందజేయటం పట్ల చరవాణిలో శంకర్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఈ అవార్డు అందజేసిన కార్యక్రమంలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు సుబ్ర మణియన్ ,తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నల్లా జ్యోతి శంకర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక