మన్మోహన్ సింగ్ మృతిపట్ల కూనంనేని సంతాపం

మన్మోహన్ సింగ్ మృతిపట్ల కూనంనేని సంతాపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 27.
కొత్తగూడెం ప్రముఖ ఆర్థిక వేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు  కూనంనేని సాంబశివరావు, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్  మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: