స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ
ఓపెన్ టెన్త్, ఇంటర్ 'తత్కాల్ అడ్మిషన్స్' కు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 24.
పాల్వంచ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్/మే నెలలో నిర్వహించే వార్షిక పరీక్షలకు సంబంధించి అడ్మిషన్స్ పొందగోరే అభ్యర్థులు తత్కాల్ ద్వారా అడ్మిషన్స్ ను డిసెంబర్ 30వ తేదీ వరకు పొందవచ్చునని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ ఏ ఐ కోఆర్డినేటర్ జి భాస్కర్ రావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఈ విద్యా సంవత్సరమునకు ఇదే చివరి అవకాశమని, వార్షిక పరీక్షలకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నదని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. గతంలో అడ్మిషన్స్ పొందిన వారికి ఆదివారము మరియు ఇతర సెలవు దినములలో తరగతులు నిర్వహించ బడుతున్నాయని,అభ్యర్థులు వాటిని సద్వినియోగం చేసుకొని ఉత్తీర్ణులు కావాలని కోరినారు. మరిన్ని వివరాలకు 9866806532 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేసినారు.జి. భాస్కరరావు ఏ ఐ కోఆర్డినేటర్ స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
9866806532