సినిమా వాళ్లు తప్ప పేద ప్రజలు కనబడరా!కల్వకుంట్ల వాళ్లకు?
విలేకరుల సమావేశంలోనిలదీసినరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్25:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో పాటు మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి సినిమా వాళ్లు తప్ప సామాన్య ప్రజలు కనిపించరని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తూ అదే వేదిక పైనుండి ముఖ్యమంత్రిని విమర్శించడం సంజయ్ కి మతిభ్రమించింది అనడానికి నిదర్శనం అని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో ఏం పని చేశాడు అని సంజయ్ నిలదీయడం అవివేకమని కెసిఆర్ లాగా ఫామ్ హౌస్ లో పండి పరిపాలన చేయడం లేదని ప్రజల్లో ఉంటూ ప్రజా పాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని జువ్వాడి కృష్ణారావు అన్నారు కల్వకుంట చంద్రశేఖర రావు ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరకాలం పూర్తయిందని ఆయన ఈరోజు వరకు అసెంబ్లీకి ఎందుకు హాజరు కాలేదో మాట్లాడే దమ్ము సంజయ్ కుందా అని నిడదీశారు మొత్తం కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్త మాంసాన్ని జలగల్లా పట్టిపీడించారని కల్వకుంట చంద్రశేఖర రావును మొదలుకొని కల్వకుంట్ల సంజయ్ కుటుంబం వరకు తెలంగాణ ప్రజలను దోపిడీ చేశారనికేసీఆర్ ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల నుండి ఎమ్మెల్యే జీతం రూపంలో తీసుకున్న డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలని జువ్వాడి కృష్ణారావుడిమాండ్ చేశారు ఒక దళితుడు అసెంబ్లీ స్పీకర్ గా సమాధ్యక్షుడు హోదాలో ఉండడం చూసి ఓర్వలేక అహంకారంతో అసెంబ్లీకి రావడం లేదని కానీ ఇతర జీతభత్యాలు అన్నీ కూడా తెలంగాణ ప్రజల నుండికేసీఆర్ తీసుకుంటున్నాడని జువ్వాడి కృష్ణారావు అన్నారు అన్నారు సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని సామాన్య బీద ప్రజలవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిలబడుతుందని సినిమా వాళ్ళ వైపు కల్వకుంట కుటుంబము నిలబడుతుందనిఅన్నారు గతంలో కొండగట్టు వద్ద ప్రమాదం జరిగి 60 మందిసామాన్య ప్రజలు మరణిస్తే కనీసం వారిని చూడడానికి ఆ కుటుంబాలను పరామర్శించే తీరిక లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇతర పారిశ్రామికవేత్తల సంపన్నుల కుటుంబాలలోఏవరైనా మరణిస్తే హుటాహుటిన వెళ్తారని అన్నారు ఈరోజు కూడా మొత్తం కల్వకుంట్ల కుటుంబo అదే బాటలో నడుస్తుందని అన్నారు తొక్కిస్లాటలో మరణించిన బీద మహిళ పట్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన దర్మం వైపు నిలబడ్డారని కల్వకుంట్ల కుటుంబం మొత్తం కేసీఆర్ ను మొదలుకొని కల్వకుంట్ల సంజయ్ వరకు అధర్మం వైపు నిలబడ్డారని ప్రభుత్వాలు చట్టాలు బాధితుల వైపు సామాన్య ప్రజల వైపు నిలబడాలి అది ధర్మం కనుక రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల వైపే ఎప్పటికీ ఉంటారని కల్వకుంట్ల కుటుంబంలో అధర్మం వైపు నిలబడరని అన్నారు సినిమా వాళ్ల గురించి మాట్లాడే ముందు నీకు ఓట్లేసిన పేద ప్రజల గురించి ఆలోచించు సంజయ్ సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అని జువ్వాడి కృష్ణారావు అన్నారుఈ కార్యక్రమం లో జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి పుప్పాల ప్రభాకర్ డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శులు రాజోజీ సదానంద చారి నేమూరి భూమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్వసీమ్ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లాల వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ రాజోజి భూమయ్య మేకల నరసయ్య భూస రాజేశ్వర్ సదుల వెంకటస్వామి బోయిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.